calender_icon.png 29 April, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళ సీఎం ఆఫీసుకు బాంబు బెదిరింపు

28-04-2025 11:47:12 PM

సచివాలయం, కొచ్చి ఎయిర్‌పోర్టుకు సైతం..

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికి సోమవారం బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. సీఎం అధికారిక నివాసంతో పాటు సచివాలయం, కొచ్చి ఎయిర్‌పోర్టుకు సైతం బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అధికారుల సమాచారంతో బాంబు స్వాడ్, పోలీస్ బృందాలు ఆయా ప్రదేశాలకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. గడిచిన రెండు వారాలుగా కేరళలోని ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. రెండు వారాల్లో 12 సార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు.  కేరళ హైకోర్టు సమా జిల్లా కలెక్టరేట్‌లు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలకు ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు పేర్కొన్నారు. మరోవైపు మే 2న ప్రధాని మోదీ కేరళ పర్యటనను పురస్కరించుకొని బాంబు బెదిరింపులపై పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.