- ఆరు గంటల పాటు బాంబు స్కాడ్ తనిఖీలు
- ఫేక్ మెయిల్‌గా గుర్తించిన అధికారులు
రాజేంద్రనగర్, అక్టోబర్ 10: ‘ఇండిగో విమానంలో బాంబు పెట్టాం.. అది ఎప్పుడైనా పేలొచ్చని’ గుర్తుతెలియని ఆకతాయిలు ఎయిర్‌పోర్టు అధికారులు మెయిల్ పంపారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం ఉదయం ఓ ఇండిగో విమానానికి బాంబు బెది రింపు మెయిల్ వచ్చింది.
కోయంబత్తూరు, చెన్నై వయా హైదరాబాద్ మీదుగా వెళ్లే విమానంలో బాంబు పెట్టామని, అది త్వర లో పేలుతుందని మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు శం షాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు. దా దాపు 6 గంటల పా టు బాంబుస్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు.
ఫేక్ మెయిల్‌గా అధికారులు గుర్తించారు. బాంబు బెదిరింపుతో విమానంలో ఉన్న 181 మంది ప్రయాణికులు భయాందోళన చెందారు. అనంతరం విమానం వెళ్లిపోయింది. అయితే, మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.