calender_icon.png 10 October, 2024 | 1:50 PM

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

10-10-2024 12:00:01 PM

మెయిల్ పంపించిన గుర్తు తెలియని వ్యక్తులు

బాంబు స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు  

ఫేక్ మెయిల్ గా గుర్తించిన అధికారులు  

రాజేంద్రనగర్, (విజయక్రాంతి): రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఈ ఫోటో అధికారులతో పాటు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలోని ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోయంబత్తూర్, చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ఎయిర్ పోర్టు అధికారులకు మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అత్యవసరంగా విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. దాదాపు 6 గంటల పాటు బాంబు స్క్వాడ్ సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దానిని ఫేక్ మెయిల్ గా అధికారులు నిర్ధారణ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా బాంబు బెదిరింపు వచ్చిన విమానంలో 181 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు బెదిరింపు కాలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.