హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29(విజయక్రాంతి): బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బుధవారం బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఈమెయిల్ పంపినట్లు ఆ స్కూల్ వర్గాలు తెలిపాయి. బాంబు బెదిరింపు నేపథ్యంలో అప్రమత్తమైన స్యూల్ యాజమాన్యం పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించింది. అనంతరం తమ పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు తెలిపారు.
ఆర్మీ, పోలీస్ అధికారులు, బాంబు స్కాడ్‌తో స్కూల్లో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని నిర్ధారించారు. దీంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు ఈరోడ్ నుంచి మెయిల్ వచ్చినట్టు నిర్ధారించినట్లు తెలుస్తోంది.