calender_icon.png 31 October, 2024 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమానాలకు బాంబు బెదిరింపులు

31-10-2024 12:24:24 AM

ఎనిమిది కేసులు నమోదు 

రాజేంద్రనగర్, అక్టోబర్ 30: శం షాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాలకు బాంబు బెదిరింపులకు సంబం ధించి 8 కేసులు నమోదు చేసినట్లు ఆర్‌జీఐఏ ఠాణా ఇన్‌స్పెక్టర్ బాలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు బుధ వారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియాతో పాటు ఐదు ఇండిగో విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేసి ఫేక్ కాల్స్‌గా నిర్ధారించారని పేర్కొన్నారు. అదేవిధంగా గతంలోనూ బెదిరింపులు వచ్చాయని, ఈ మేరకు మొత్తం 8 కేసులు నమోదు చేశామని, ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.