calender_icon.png 5 November, 2024 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమానాలకు మళ్లీ బాంబు బెదిరింపు కాల్స్

03-11-2024 12:06:05 PM

రాజేంద్రనగర్, విజయక్రాంతి:  శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆదివారం మళ్లీ  అలజడి మొదలైంది. గోవా నుండి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. మళ్లీ గంటకి బెంగళూరు హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది.  మళ్లీ గంటకి హైదరాబాద్ పూనా ఇండిగో విమానానికి వచ్చింది.

మూడు ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో  వెంటనే అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిఐఎస్ఎఫ్ సిబ్బంది విమానాలను ఐసోలేషన్ కు తరలించారు. గోవా-కోల్ కత్తా విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారంతా తీవ్రభయంతో ఆందోళనకు గురయ్యారు. చివరకు అవి ఫేక్ కాల్చుగా ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు విచారణ జరుపుకున్నారు.