శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
24-05-2026 11:54 AM
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఒక ఈమెయిల్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన ఈమెయిల్ బెదిరింపుతో శంషాబాద్ అధికారులు అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయించారు. విమానం దిగిన వెంటనే ప్రయాణికులను ఐసోలేషన్ ప్రాంతానికి తరలించి, భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ మెయిల్‌పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.






