calender_icon.png 17 January, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్ సీఎం ఇంటి వద్ద బాంబు కలకలం

18-12-2024 01:37:54 AM

ఆ టైంలో ఇంట్లో లేని సీఎం బీరెన్ సింగ్

ఇంఫాల్, డిసెంబర్ 17:  మణిపూర్‌లో సీఎం బీరెన్ సింగ్ ఇంటి సమీ పంలో బాంబు దొరకడం కలకలం సృష్టించింది. కొయిరెంగోయ్ ప్రాంత లో సీఎం బీరెన్ సింగ్‌కు ఓ ఇల్లు ఉన్నది. ఈ ఇంటికి సమీపంలోనే కొన్ని మీటర్ల దూరంలో మోర్టార్ బాంబును స్థానికులు మంగళవారం ఉదయం గుర్తిం చారు. దీంతో భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాం బును నిర్వీర్యం చేశారు.

అయితే బాంబు పడిన సమయంలో సీఎం బీరెన్ సింగ్ ఆ ఇంటి లో లేరని తెలుస్తోంది. ఈ రాకెట్ ప్రొపెల్డ్ బాంబు ను సోమవారం రాత్రి ప్రయోగించి ఉంటా రని, అయితే అది పేలకుండా అక్కడ పడిపోయి ఉండవచ్చని పోలీసులు అను మాని న్నారు. బాంబు ఘటన నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద భద్రతను పెంచా రు. బాంబును ఎవరు ప్రయోగించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చా రనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.