రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): నాటుబాంబులు తయారు చేస్తున్న మూఠాను అరెస్ట్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. గత రెండు రోజుల క్రితం కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో గేదే నాటు బాంబుని తిని చనిపోయింది. గేదే యజమాని ఇచ్చిన ఫిర్యాధుతో జిల్లాలో వివిధ గ్రామాలకు చెందిన పిట్టల రాజలింగం, పడిగే లస్మయ్య, తుమ్మల కనకరాజు, అంజయ్యను అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల వేట కోసం నాటుబాంబులను తయారు చేస్తున్నట్టు నిందితులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి నుంచి 67 నాటు బాంబులను, గన్ పౌడర్‌లను స్వాధీనం చేసుకున్నారు.