రంగారెడ్డి,(విజయక్రాంతి): మైలార్ దేవ్ పల్లి పరిధిలోని లక్ష్మీగూడలో బాంబు పేలుడు కలకలం రేపింది. ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత మందిరం ప్రాంగణంలో చెత్త తొలగిస్తుండా ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ పేలుడులో ఆలయ పూజారి సుగునారామ్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుట్టహుట్టిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.