calender_icon.png 7 October, 2024 | 12:42 PM

కరాచీ ఎయిర్‌పోర్ట్‌ బాంబు పేలుడు

07-10-2024 10:12:27 AM

కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు చైనా పౌరులు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు. చైనా ఇన్వెస్టర్స్‌, ఇంజనీర్లు టార్గెట్‌గా పేలుడు జరిగినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారి మీడియాతో తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం, పాకిస్తాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయమైన కరాచీ విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది. పేలుడు చాలా పెద్దదై విమానాశ్రయ భవనాలు కంపించాయని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న రాహత్ హుస్సేన్ తెలిపారు. క్షతగాత్రుల గురించి పోలీసు సర్జన్ డాక్టర్ సుమయ్య తారిఖ్ మాట్లాడుతూ, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులందరినీ అత్యవసర చికిత్స నిమిత్తం జిన్నా ఆసుపత్రికి తరలించారు. సింధ్ సీఎం మురాద్ అలీ షా ఘటనపై వివరణాత్మక నివేదికను కోరినట్లు మాలిర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే రోడ్లను బ్లాక్ చేయవద్దని కూడా షా ఆదేశించారు.