calender_icon.png 2 April, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్ పద్ధతి మార్చుకోవాలి

01-04-2025 02:40:59 AM

నటిగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రిచా చద్దా. ఇటీవలే ఆమె నిర్మాతగా మారింది. బాలీవుడ్‌లో మార్పులు రావాలంటూ ఆ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కొంత కాలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అలా బీటౌన్‌పై మాట్లాడిన వారి జాబితాలో ఇప్పుడు రిచా చద్దా పేరూ చేరిపోయింది. తాజాగా రిచా హిందీ చిత్ర పరిశ్రమపై మాట్లాడింది. ‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు సోషల్‌మీడియా కారణంగా సులభంగా గుర్తింపు సొంతం చేసుకునే వెసులుబాటు కలిగింది.

కానీ, బాలీవుడ్‌లో కొత్త హీరోయిన్లకు అవకాశాలు మాత్రం రావడంలేదు. అగ్ర దర్శక నిర్మాతలు కూడా మూస పద్ధతిలోనే హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారు. ఈ విధానంలో మార్పు రావాల్సి ఉంది. సినిమాలు నిర్మించే విషయంలోనూ బాలీవుడ్‌లో మార్పులు రావాల్సి ఉంది. ఎవరైనా పెద్ద స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయినప్పుడు అందరూ జాగ్రత్త పడతారు. సినిమాల్లోని ఐటెమ్ సాంగ్, యాక్షన్ సన్నివేశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తే ఈ అవసరం ఉండదు కదా?! ఇప్పటికే మన ముందు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిని చూసైనా మారలేకపోతున్నాం. సౌత్ ఇండస్ట్రీ సినిమాలు ప్రేక్షకాదరణ దక్కించుకుంటు న్నాయి. ప్రేక్షకులకు సినిమాలు తీయడంలో దక్షిణాది మేకర్స్ విజ యం సాధించారు. వారిని చూసి మనం నేర్చుకోవచ్చు’ అని అన్నారు.