calender_icon.png 24 December, 2024 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్ కలలను నిజం చేసుకున్నా

17-10-2024 12:00:00 AM

ప్రియాంక చోప్రా తన బాలీవుడ్ కలలను నిజం చేసుకున్నారట. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లొచ్చిన ప్రియాంక కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇన్‌స్టాగ్రాం స్టోరీస్‌లో ప్రియాంక క్రాన్స్ - మోంటానాలో జరిగిన షూటింగ్ విశేషాలను ఒక స్లో మోషన్ వీడియోతో పంచుకున్నారు.  పూర్తిగా మంచుతో కప్పబడిన నేలపై  ప్రియాంక చిరునవ్వులు చిందుస్తూ నిలబడ్డారు.

అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దుస్తులు ధరించారు. తన వీడియోకు దివంగత నటి శ్రీదేవి, రిషీకపూర్ నటించిన ‘చాందినీ’ చిత్రంలోని ఓ మేరీ చాందినీ పాటను జోడించారు. చాందినీ చిత్రాన్ని స్విట్జర్లాండ్‌లోనే చిత్రీకరించారు.

ఈ వీడియోకు ‘నా బాలీవుడ్ కలలను నిజం చేసుకున్నా’ అనే క్యాప్షన్‌ను జోడించారు. తన చిత్రం షూటింగ్‌కు సంబంధించిన ఎన్నో ఫోటోలను ఇన్‌స్టాలో ప్రియాంక పంచుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్ 2’ చేస్తున్నారు. అలాగే ‘బ్లఫ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.