బాలీవుడ్ హీరోయిన్స్ కేవలం నటనలోనే ఫ్యాషన్‌లోనూ జిగేల్ అంటూ మెరుపులు మెరిపిస్తున్నారు. లేటెస్ట్ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా మారుతూ ఫ్యాషన్ ప్రియుల మనసులను దోచుకుంటున్నారు. సినిమా ప్రమోషన్లలో సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్ తో బాలీవుడ్ బ్యూటీలు అలియా భట్, జాన్వీ కపూర్, శ్రద్ధాకపూర్ లాంటి హీరోయిన్స్ కొత్త కొత్త ఫ్యాషన్ స్టైల్ తో హోయలు ఒలకబోస్తున్నారు. ఇటీవల సాహో ఫేం శ్రద్ధాకపూర్ ’స్త్రీ 2 మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఎరుపు రంగు చీర ధరించి, పొడవైన జుట్టు, వెండి ముక్కుపడకతో సరికొత్త ఫ్యాషన్ ను పరిచయం చేశారు. జాన్వీ కపూర్ ఇటీవల మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో రెడ్ అండ్ వైట్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని జాన్వీ తన డ్రెస్సింగ్ స్టైల్లో మూవీని ప్రమోషన్స్లో రిప్రెజెంట్ చేయడం విశేషం. ’గంగూబాయి కతియావాడి’ ప్రమోషన్ కోసం ఆలియా భట్ తెల్లచీరలు ధరించి తన గ్రేస్ ఎంటో చూపించింది.