24-03-2025 01:24:51 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లో బాలీవుడ్ నటిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబాయికి చెందిన ఓ బాలీవుడ్ నటికి మార్చి 17వ తేదీన హైదరాబాద్ కు చెందిన ఓ స్నేహితురాలు ఫోన్ కాల్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించింది. హైదరాబాద్ కు రావడానికి కావాల్సిన విమాన ఛార్జీలు, పారితోషికం చెల్లిస్తారని నటికి స్నేహితురాలు చెప్పడంతో 18న నగరానికి చేరుకున్నారు. షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన బాలీవుడ్ నటికి మాసబ్ ట్యాంక్ శ్యామ్ నగర్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో బస ఏర్పాటు చేశారు. మార్చి 21న రాత్రి 9 గంటలకు ఇద్దురు మహిళలు బాలీవుడ్ నటి ఉన్న గదిలోకి వెళ్లి తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారు.
అనంతరం ముగ్గురు వ్యక్తులు అదే రోజు 11 గంటలకు నటి ఉంటున్న గదికి వెళ్లి బలవంతం చేయబోతుంటే ఆమె ఎదురు తిరిగింది. దీంతో బాధితురాలిపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడారు. బధితురాలు కేకలు వేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పరారయ్యారు. అనంతరం వృద్ధురాలు, ఇద్దురు మహిళలు నటిని గదిలో బంధించి రూ.50 వేలతో పారిపోవడంతో బాధితురాలు డయల్ 100 కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో మాసబ్ ట్యాంకు పోలీసుల కేసు నమోదు చేసుకొని, బాలీవుడ్ నటిని హైదరాబాద్ పంపిన వ్యక్తి కోసం ముంబాయికి వెళ్లారు.