calender_icon.png 1 October, 2024 | 1:07 PM

బాలీవుడ్‌ నటుడు గోవిందాకు బుల్లెట్‌ గాయం

01-10-2024 10:28:37 AM

బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నేత గోవిందాకు బుల్లెట్ గాయాలయ్యాయి. తుపాకీ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన మేనేజరు తెలిపారు. నటుడు గోవిందా మంగళవారం ఉదయం  ఆయన కోల్ కతా వెళ్లేందుకు సిద్దమవుతుండగా తన లైసెన్స్ రివాల్వర్ ను తుపాకీ కేసులో పెట్టుకుంటుండగా అది చేతిలో నుంచి జారీ కిందపడటంతో ప్రమాదవశత్తూ తుపాకీ పేలింది. ఈ ఘటనలో బుల్లెట్ గోవిందా కాలిలోకి దూసుకెళ్లింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడంతో వైద్యులు బుల్లెట్ ను తొలగించారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారని ఆయన మేనేజర్ వెల్లడించారు.