calender_icon.png 30 March, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోను ఢీకొట్టిన బొలోరో వాహనం

26-03-2025 10:25:41 PM

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. భూపాలపల్లి పట్టణంలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఆటో నుజునుజ్జు అయింది. హోంగార్డు డ్రైవింగ్ చేసినట్లు సమాచారం. కాగా మత్తులో డ్రైవింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం పోలీసు సైరన్ వేసుకొని వాహనం స్టేషన్ కు వెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.