calender_icon.png 16 November, 2024 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలీలను తరలిస్తున్న బోలోరో వాహనం బోల్తా

29-06-2024 11:05:41 AM

25 మంది కూలీలకు తీవ్రగాయాలు

మరి కొంతమంది పరిస్థితి విషమం   

నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో ఘటన           

నాగర్ కర్నూల్, విజయ క్రాంతి: నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలను తరలిస్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో చోటు చేసుకుంది. తాడూరు మండలం ప్రాంతంలో పత్తి చేను కలుపు తీసేందుకు కూలీ కోసం కోడేరు మండలం చెందిన 25 మంది పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన మరో 25 మంది కూలీలను తరలిస్తుండగా కోడేరు మండలం పిఎసిఎస్ గోదావరి వద్ద అత్యంత వేగంతో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది.

దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న కూలీలకు కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చెన్నప్ప రావు పల్లి,  గండ్రావుపల్లి,  పెద్దకొత్తపల్లి మైసమ్మ వద్ద తదితర ప్రాంతాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని అతివేగంతో బోల్తా కొట్టిన ఘటనలో చోటు చేసుకున్నా అటు పోలీసులు, ఇటు ఆర్టీవో అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఈలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.