ముగ్గురి పరిస్థితి విషమం
నాగర్కర్నూల్, జూన్ 29 (విజయక్రాంతి): పత్తికలుపు తీసేందుకు కూలీలను తరలిస్తున్న బొలేరో వాహనం అతివేగంతో అదుపుతప్పి బోల్తాపడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేడేరు మండల కేంద్రానికి చెందిన 25మంది కూలీలు, పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామా నికి చెందిన మరో 25మంది కూలీలు తాడూ రు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలో పత్తి కలుపు తీసేందుకు బొలేరో వాహనంలో వెళ్తున్నారు.
కోడేరు మండలం సింగిల్ విండో కార్యాలయ సమీపంలో అతివేగం కారణంగా వాహనం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న వారిలో 25మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు కోడేరు ప్రభుత్వ ఆస్పత్రికి అటు నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.