calender_icon.png 16 January, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోల్డ్, స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశా

07-08-2024 12:05:00 AM

‘డబుల్ ఇస్మార్ట్’ హీరోయిన్ కావ్య థాపర్

హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కావ్య థాపర్ నటించింది. ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మల యాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ మూవీ. ఈ నేపథ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలివీ.. “పూరి గారు గ్రేట్ డైరెక్టర్. ఆయన హీరోయిన్ అవ్వాలని ఉండేది. ప్రీక్వెల్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు ఆడిషన్ ఇచ్చాను కానీ, కుదరలేదు. సీక్వెల్ కోసం నా ఆడిషన్ -పూరి సర్, ఛార్మి గారికి నచ్చిన తర్వాత ఓ చిన్న యాక్సి డెంట్ కారణంగా వెయిట్ పెరిగాను.. కొంచెం తగ్గమని చెప్పారు.

రెండు నెలలు హార్డ్ వర్క్ చేసి వెయిట్ తగ్గి, పూరి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్‌కి ఫిట్ అయ్యాను. -ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. సినిమాలో నాకు ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. సాంగ్ షూట్‌లో ఫస్ట్ డే మార్నింగ్ సిక్ అయ్యాను. అయినా సెట్‌లోకి వచ్చాను. ఛార్మి గారు నన్ను చూసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు.. చాలా కేర్ తీసుకున్నారు. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిశ్చార్జ్ అయి, బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. -రామ్ గారు చాలా పాషనేట్ యాక్టర్.

హైలీ ఎనర్జిటిక్ పర్సన్. మా కెమిస్ట్రీ ది బెస్ట్ వచ్చింది. ఆయన నుంచి చా లా విషయాలు నేర్చుకున్నాను. సంజయ్ దత్‌కు, నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆయనతో వర్క్ చేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. పూరి గారి నుంచి చాలా విషయా లు నేర్చుకున్నాను. ఆయన విజ న్ క్లియర్‌గా ఉంటుంది. సెట్‌లో కూల్ గా ఉంటారు. ఆయనలో మంచి ఫిలాసఫర్ ఉన్నా రు. జీవితం పట్ల ఆయనకున్న క్లారిటీ అమేజింగ్. -ఛార్మి మేడమ్.. ఓ బాస్ లేడీ! తను పవర్ హౌస్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హ్యాట్సప్ టు ఛార్మి గారు. మణిశర్మ గారు లెజండరీ కంపోజర్.

ఆయన సాంగ్స్‌కు డ్యాన్స్ చేయడం లక్కీగా భావిస్తున్నాను. -డబుల్ ఇస్మార్ట్ స్ట్రయిట్‌గా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇదొక బ్లెస్సింగ్‌లా భావిస్తున్నాను” అని వివరించింది. ఇంకా డ్రీమ్ రోల్, ఫ్యూచర్ ప్రాజె క్టుల గురించి చెప్తూ.. ‘నాకు యాక్షన్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. అలా గే అడ్వంచరస్ మూవీ చేయాలని ఉంది. -గోపిచంద్ గారితో విశ్వం చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల్లో ఉ న్నాయి’ అని ముగిం చింది కావ్య థాపర్.