కరీంనగర్ (విజయక్రాంతి): మహారాష్ట్ర ఎన్నికల సరళిని పరిశీలించిన బోయినపల్లి వినోద్ కుమార్ బృందం. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవిందర్ రావు, తెలంగాణ పౌరసఫరాల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్, రంగినేనీ పవన్ కుమార్(ఆదిలాబాద్) హైదరాబాద్ నుండి తన వెంట మరో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులతో కలిసి రెండు రోజుల పాటు పర్యటించారు. గురుద్వారాను దర్శించుకున్నారు. అనంతరం పూజారులు ఆశీర్వచనం అందించారు. మరట్వాడా, విదర్భ ప్రాంతాల్లోని పలు శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాలను సందర్షించి ఎన్నికల ప్రక్రియ గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాందేడ్, కిణ్వట్, బోఖార్, నాయిగొన్, ముఖేడ్ ప్రాంతాల్లో (విద్యావేత్తలు, న్యాయవాదులు, ఇంజనీర్లు) రాజకీయ విశ్లేషకులను కలిసి మహారాష్ట్ర ఎన్నికల సరళి గురించి అభిప్రాయాలు తెలుసుకున్నారు.