గుజరాత్‌లో ఘటన
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గుజరాత్‌లోని భరూచ్‌లో ఉన్న పారిశ్రామిక యూనిట్‌లో మంగళవారం బాయిలర్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందారు. స్థానిక అంక్లేశ్వర్ జీఐడీసీ పారిశ్రామిక యూనిట్‌లో డిటాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో వ్యర్థాలను శుద్ధిచేసి పారబోసే సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు జిల్లా యంత్రాం గం స్పష్టం చేసింది.
పోలీస్ సూపరింటెండెంట్ మయూర్ చావ్డా మాట్లాడుతూ.. ప్రమాదంలో నలుగురు మృతిచెందారని, మరెవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎలాంటి మంట లు వ్యాపించలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు ప్రారంభిం చామని భరూచ్ కలెక్టర్ తుషార్ సుమేరా పేర్కొన్నారు.