- హింసకు దారితీసిన మసీదు సర్వే
- ముగ్గురు మృతి.. 30 మంది పోలీసులకు గాయాలు
లక్నో, నవంబర్ 24: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం ఉదయం హింస చెలరేగింది. మొఘల్ కాలం నాటి జామా మసీద్‌పై ‘అడ్వకేట్ కమిషనర్’ నేతృత్వంలో యంత్రాంగం సర్వేకు పూనుకోగా, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్న క్రమంలో తోపులాట జరిగింది.
అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. స్థానికులు పోలీస్ బలగాలపై రాళ్లు రువ్వారు.పదికి పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. దాడుల్లో తీవ్రగాయాల పాలై స్థానికులు నయీమ్, బిలాల్, నౌమాన్ మృతిచెందారు. 30 మందికి పైగా పోలీసులు గాయాల పాలయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఒకదశలో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.
దాడులకు కారణమైన పది మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదిఏమైనప్పటికీ అధికారులు మాత్రం సర్వేను ఆపకుండా, తమ పని తాము చేసుకుపోయారు. సోమవారం కూడా సర్వే కొనసాగనున్నది. ఈ నెల 29లోపు అధికారులు పూర్తి చేయాల్సి ఉండగా, గడువులోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు. మొరాదాబాద్ డీఎస్పీ ఆంజనేయకుమార్ సిన్హా నేతృత్వంలో సంభాల్‌ను భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.
వివాదం ఎందుకంటే..?
సంభాల్‌లో ప్రస్తుతం మసీద్ ఉన్న చోట క్రీ.శ 1529కి ముందు ఆలయం ఉండేదని, ఆ లయాన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ ధ్వం సం చేశాడని ఒక వర్గం ఆరోపిస్తున్నది. 1991 పార్థనా స్థలాల చట్టం ప్రకారం సదరు స్థ లంలో సర్వే చేయించాలని న్యాయస్థానా న్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో అధికారు లు సర్వేకు పూనుకున్నారు.