calender_icon.png 18 January, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెయ్యి ఉడుకు.. వొళ్లు వణుకు!

14-09-2024 12:23:49 AM

  1. దడ పుట్టిస్తున్న విషజ్వరాలు 
  2. డెంగ్యూ, చికున్ గున్యాతో జనం అవస్థ 
  3. కీళ్లు, ఒళ్లు నొప్పులతో సతమతం 
  4. జ్వరం తగ్గాక మచ్చలతో ఆందోళన 
  5. వయసు తేడాలేకుండా బాధితులే 
  6. మారుమూల గ్రామాలకు వైద్యులు దూరం

కామారెడ్డి,సెప్టెంబర్13 (విజయక్రాంతి): వైరల్ జ్వరాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఓ వైపు జ్వర వేడి, మరో వైపు ఒళ్లు నొప్పులతో ప్రజలు సతమతమవుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా.. పల్లె, పట్టణాల్లో ఎక్కడ చూ సినా జ్వర బాధితులే కన్పిస్తున్నారు. డెంగ్యూ , చికున్‌గున్యా లక్షణాలతో ప్రజలు అవస్థలు పడుతున్న వైద్యాధికారులు నిద్ర మత్తు వీడ టం లేదు. మారుమూల ప్రభుత్వ ఆసుపత్రు ల్లో పనిచేసే వైద్యులు సమాయానికి రాకుం డా రోగులకు నర్సులే వైద్యం చేసి పంపుతున్నారు.

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఇటీవల రోగులు ఆందోళన చేశార ంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 12 గంట ల వరకే ఒక వైద్యుడు ఉండి రోగులు ఉన్న వారిని చూడకుండానే వెళ్లిపోయారని బాధితులు వాపోయారు. ఈ విషయంపై కలెక్టర్ ఆశిష్‌సంగ్వాన్ సీరియస్ అయ్యారు. సదాశివనగర్ మండలం ఉత్తునూర్‌లో ఇంటింటికి చికున్‌గున్యా, డెంగ్యూ వ్యాధి లక్షణాలతో జ్వరాల బారిన పడి అవస్థలు పడుతున్నామ ని, ఆసుపత్రి ఉన్నా వైద్యులు రావడం లేదని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పరిశీలించేందుకు ప్రత్యేకాధికారి జడ్పీసీఈవో చందర్‌నాయక్‌ను గురువారం పంపించారు.

గ్రామంలో రోగులను చూసి జడ్పీసీఈవో ఆందోళనకు గురయ్యారు. ప్రతి ఇం ట్లో జ్వర బాధితులు ఉండటం కలిచివేసింద ని కలెక్టర్‌కు తెలుపడంతో శుక్రవారం వైద్య శిబిరాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇలా ంటి సంఘటనలు జిల్లాలో ఎన్నో మండలాల్లోని మారుమూల గ్రామాల ప్రజలు,పట్టణ ప్రజలు జ్వరాలతో అవస్థలు పడుతున్నారు. 

ఎక్కడ చూసినా జ్వర బాధితులే 

కామారెడ్డి జిల్లాలో జిల్లాకేంద్ర ప్రధాన ద వాఖానతోపాటు దోమకొండ సీహెచ్‌సీ, ఎ ల్లారెడ్డి సీహెచ్‌సీ, బాన్సువాడ వంద పడకల ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కే్ంర దాలు,అర్భన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు మరో 280 హెల్త్ సబ్‌సెంటర్లు ఉన్నా యి. వీటితో పాటు బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు 60 వరకు ఉన్నా పేదలకు మా త్రం వైద్య సేవలు అందడం లేదు. పట్టణా ల్లో, పల్లెల్లో ఎక్కడ చూసినా జ్వర బాధితులు కనిపిస్తున్నారు. 

11 గంటలకు విధుల్లోకి..

ఉదయం 9 గంటలకే విధుల్లో చేరాల్సిన వైద్యులు, యంఎల్‌హెచ్‌పీలు, సిబ్బంది, ఏ ఎన్‌ఎంలు ఉదయం 11 గంటల వరకు చేరుకొని మధ్యాహ్నం రెండు గంటల వరకే ఇం టి దారి పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విధుల్లో ఉన్నప్పుడు ఫొటోలు దిగి తమ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిన మరికొంత మంది వైద్యులు తమ మొఖలకు చున్నీలు మార్చుతూ ఒకేసారి ఫొటోలు దిగి రెండు మూడు రోజులు వాటినే వాడుతున్న ట్టు ఆరోగ్య శాఖ సిబ్బందే బహిరంగంగా చె ప్పుకోవడం గమనార్హం.

ఇటీవల నిజాంసాగర్ మండలంలో పీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తే వైద్యులు లేకపోవడంతోపాటు రక్తపరీక్ష నిర్వహించే ఉద్యోగి రాకుండానే రిజిస్టార్‌లో సంతకాలు ఉండటంపై క లెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని  సస్పె ండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ఒకవైపు ప్రజలు జ్వరాల బారిన పడి ఆందోళన చెందుతుంటే వైద్యు లు అందుబాటులో లేకుండా పట్టణాలు ను ంచి వస్తూ పోతున్నారు.దీంతో వైద్య సేవలు అందడం లేదు.దీంతో ప్రవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు.

ఒక్కొక్కరికి రూ.20 వేలకు పైగా ఖర్చు 

జ్వరం తగ్గిన 20 రోజుల వరకు కీళ్లు, ఒం టి నొప్పులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు కనీసం నడవలేక పోతున్నారని జడ్పీ సీఈవో చందర్‌నాయక్ పరిశీలనలో సదాశివనగర్ మండలం ఉత్తూనూర్‌లో బాధితులను చూసి ఆందోళన  చెం దారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఉహించవచ్చు. కీళ్ల నొప్పులు,ఒంటి నొప్పులతో క నీసం నడవలేకపోతున్నారు. చిన్నారుల ను ంచి వృద్ధులు, మహిళల వరకు అందరూ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ముఖం, ముక్కు ఇతర ప్రాంతాల్లో నల్లని మచ్చలు వ స్తున్నాయని వాపోతున్నారు. చికిత్స కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నియమించిన అధికారులు అందుబాటులో లేకపోవడంతోపాటు సరైన చికిత్స అం దించకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెం ట్ పోందాల్సి వస్తుందని వాపోతున్నారు.

గ్రామంలో అందరికీ జ్వరాలు  

మాది రాజంపేట మండలం గుండార ం. ఊరిలో అంత జ్వ రాలతో, కీళ్ల నొప్పుల తో ఇబ్బందులు పడుతున్నారు. రెం డు రోజుల క్రితం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు వచ్చిన. ఇక్కడ చికిత్స పొ ందుతు న్నాను. ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకున్నా జ్వరం తగ్గడం లేదు. నడవడానికి వీలులేకుండా కీళ్ల నొప్పు లు ఇబ్బంది పెడుతున్నాయి.  

 గుండారం, కామారెడ్డి

పరీక్షల పేర ‘ప్రైవేటు’ దోపిడీ

పట్టణ కేంద్రాల్లో ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడి వైద్యులు వైద్యపరీక్షల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, జ్వరాలు మాత్రం తగ్గడం లేదని పలువురు రోగులు ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిలో బెడ్‌లు ఎన్ని ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ రోగులు చికిత్సలు పొందుతున్నారు. మరికొంత మంది నిత్యం ఓపీ చూపించుకొని ఇంటివద్ద చికిత్స పొందుతున్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు గ్రామాల్లో తీరిక లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారంటే గ్రామీణ ప్రజలు జ్వరాల బారిన పడి ఎంత అవస్థలు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

జ్వర పీడితుల్లో సుమారు 80 శాతం మంది డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలే కన్పిస్తున్నాయని పేర్కొంటున్నారు. నడవడానికి చేతకావడం లేదని, కీళ్ల నొప్పులు ఆందోళనకు గురి చేస్తున్నాయని వాపోతున్నారు. పరీక్షల్లో ఇవి నిర్దారణ కావడం లేదని చెప్తున్నారు. కానీ, దోమల నియంత్రణలో నెలకొన్న నిర్లక్ష్యమే జ్వరాల వ్యాప్తికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

8 రోజులుగా ఆసుపత్రిలోనే.. 

జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, కీళ్ల నొ ప్పులు రావడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన. ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది. జ్వరం తగ్గడం లేదు. రక్త పరీక్షలు చేశా రు. ప్రతిరోజు మందులు ఇస్తున్నారు. నొప్పులు తగ్గడం లేదు. నొప్పు లు,జ్వరం తగ్గే వరకు ఆసుపత్రిల్లో ఉండమని డాక్టర్లు చెప్పారు.