- అనుమానాస్పదంగా 1900 సంస్థలు
- 120 వరకు నకిలీ ఇన్వాయిస్‌లు!
- గుర్తించిన వాణిజ్య పన్నుల శాఖ
- ఫేక్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల వేటలో ఆఫీసర్లు
- ఆగస్టు 16 నుంచి కొనసాగుతున్న డ్రైవ్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): నకిలీ సంస్థల ఏరివేతలో వాణి జ్య పన్నుల శాఖ నిమగ్నమైంది. ఫేక్ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ బోగస్ సంస్థల బాగోతాన్ని బయటపెడుతోంది. ఆగస్టు 16వ తేదీన స్టేట్‌తో పాటు సెంట్రల్ జీఎస్టీ విజిలెన్స్ విభాగాలు ఈ డ్రైవ్‌ను ప్రారంభించగా.. ఇప్పటివరకు దాదాపు 1900 సంస్థలు అనుమానాస్పదంగా ఉన్నటు ్ల ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది.
వీటికి సంబంధించి ఇప్పటివరకు కొన్ని సంస్థల ఇన్వాయిస్‌లను పరిశీలించగా దాదాపు 120 బోగస్‌గా తేలినట్లు సమాచారం. ఈ స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ 15వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో మరిన్ని నకిలీ సంస్థలను గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది నిర్వహించిన స్పెష ల్ డ్రైవ్‌లో 650 నకిలీ రిజిస్ట్రేషన్లును వాణిజ్య పన్నుల శాఖ గుర్తించారు.
లీకేజీలను అరికట్టేందుకే..
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే అతిపెద్ద విభాగం వాణిజ్య పన్నుల శాఖ. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఈ విభాగం వాటా దాదాపు 65 శాతం. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ఈ శాఖ నుంచి వంద శాతం ఆదాయం రావాల్సిందే. అయితే గతంలో ఎప్పుడు కూడా బడ్జెట్ అంచనాల్లో 100 శాతం ఆదాయన్ని కమర్షియల్ ట్యాక్స్ విభాగం సాధించలేదు. గతేడాది బడ్జెట్ అంచనాల్లో 91శాతం మాత్రమే సాధించింది.
2024 ఆర్థిక సంవత్సరంలో కూడా జులై వరకు కాగ్ వెల్లడించిన లెక్క ల ప్రకారం 100 శాతం రాబడిని సాధించలేదు. ఈ నాలుగు నెలల్లో గతేడాది కంటే 4శాతం తక్కువగానే జీఎస్టీ వసూ లు కావడం గమనార్హం. దీంతో నూటికి నూరు శాతం రాబడిని సాధించాలంటే లీకేజీలను అరికట్టడమే ఏకైక మార్గంగా వాణిజ్య పన్నుల శాఖ పనిచేస్తోంది.
నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో..
ఫేక్ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను గుర్తించే స్పెషల్ డ్రైవ్‌కు నోడల్ ఆఫీసర్‌గా జాయింట్ కమిషనర్ అరవింద్‌రెడ్డిని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీ నియమించారు. రాష్ట్రంలోని అన్ని సర్కిళ్లలో అరవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. సర్కిళ్ల పరిధిలో జరుగుతున్న తనిఖీలను వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని కమిషనర్‌కు చెబుతున్నారు.
ఇది రెండో డ్రైవ్..
2017లో జీఎస్టీ ఏర్పడింది. ఈ క్రమంలో వాణిజ్య పన్నుల శాఖలో లీకేజీలను అరికట్టేందుకు గతేడాది మే నుంచి జులై వరకు మొదటి డ్రైవ్‌ను నిర్వహించారు. ఆ డ్రైవ్‌లో తెలంగాణలో 650 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లును గుర్తించారు. ఈ ఫేక్ సంస్థల ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.1100 కోట్ల ఆదాయానికి గండిపడినట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర ప్రభు త్వం కూడా ఈ శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈసారి బోగస్ సంస్థల ఏరివేతపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.