calender_icon.png 20 September, 2024 | 10:11 PM

బోగస్, మరణించిన వారి ఓట్లను తొలగించాలి

20-09-2024 07:27:51 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామపంచాయతీ పరిధిలో బోగస్, చనిపోయిన ఓట్లు అధికంగా ఉన్నాయని.. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి వెంటనే  బోగస్ ఓట్లను తొలగించాలన్నారు. కరీంనగర్ రురల్ ఎమ్మారో సిహెచ్. రాజు కు దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు వినతిపత్రం అందజేశారు. బోగస్ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ పమేల సత్పతి, ఆర్డీవో, ఎంపీడీవో దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సంపత్ రావు  వెల్లడించారు.. ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ ఓటర్ లిస్టులో ఆరు సంవత్సరాల క్రితం చనిపోయిన వారి పేర్లు సైతం ఉన్నాయని ఇంటి నంబరు లేకుండా ఉన్న వారిపేర్లు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి పేర్లు బోగస్ ఓట్లుగా నమోదయ్యాయన్నారు.మృతుల పేర్లు తొలగించలేదని, కొత్త ఓటర్ల పేర్లు గల్లంతు కావడం.

ఒకే కుటుంబసభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లోరావడం

కొందరి ఇంటి, భర్త పేర్లు  తప్పుగా తప్పుగా ముద్రించబడ్డాయని అధికారులు వెంటనే స్పందించి బోగస్ ఓట్లను తొలగించాలని వెల్లడించారు. కొత్తగా ఓటుహక్కు పొంది, పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించుకున్న పలువురు యువతీ యువకుల ఓట్లు పంచాయతీ ఓటర్ల జాబితాలో రాలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగానే అధికారులు పంచాయతీ ముసాయిదా ఓటరు జాబితా రూపొందించి వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేశారని, పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తగా ఓటు వేసిన ఓటర్లను అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో ఓటువేసే అవకాశం లేకుండా పోతుందని అంతేకాకుండా, వార్డు సభ్యులుగా, సర్పంచ్ గా పోటీ చేసేందుకు అనర్హులవుతారని వెల్లడించారు.