calender_icon.png 1 November, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తం గూట్లో విషసర్పంలా చొరబడ్డ ఎమ్మెల్యే : భోగ శ్రావణి

06-07-2024 05:07:31 PM

జగిత్యాల: ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి  నాలుగు దశాబ్దాలుగా అనేక కష్ట నష్టాల కోర్చి నిర్మించుకున్న హస్తంగూట్లో విషసర్పంగా ఎమ్మెల్యే డా. సంజయ్ చొరబడ్డారని బీజేపీ రాష్ట్ర  కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కేంద్రం జగిత్యాల బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసు నుండి తప్పుకోవడానికి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఆమె ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో  ప్రధాన పాత్ర ఎమ్మెల్యే సంజయ్ దేనని, ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ నా ఫోన్, మా కుటుంబ సభ్యుల,  అనుచరుల ఫోన్ ట్యాప్ చేయించారని అన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ప్రజల మీద, ప్రజా తీర్పుపై నమ్మకం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హిందువుల పై అక్కసు తో మాట్లాడుతున్నారని, పదేళ్ల  తర్వాత  ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చాక మొదటిసారి మాట్లాడి హిందూబంధువులపై విషం చిమ్మి రాహుల్ గాంధీ తన నిజ స్వరూపం బయట పెట్టుకున్నారని గుర్తు చేశారు.హిందువుల విభజించి పాలించడానికి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఒక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయని నిజామాబాద్ ఎంపీగా నిలుచున్నామని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 40యేళ్ళు కష్టపడి కట్టుకున్న కాంగ్రెస్ గూట్లోకి విషసర్పంలాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చొరబడడం బాధాకరం అన్నారు.

నాడు ఉద్యమ కారులను మోసం చేసి అధికారంకోసం టీఆర్ఎస్  లో చేరిన సంజయ్ నేడు అధికారం కోసం ఎవరికీ చెప్పకుండా రాత్రివేళల్లో దొంగలా పార్టీ మారాడని విమర్శించారు. పదేళ్ళుగా  అధికార పార్టీలో ఉండి ఆరు నెలలు అధికారం లేకుండా ఉండలేకపో యాడని ఎమ్మెల్యే నైజం బయట పెట్టారు. తాను మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు యావ రోడ్ 100ఫీట్లకు గెజిట్ చేశారు యావర్ రోడ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు. యావర్ రోడ్ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే సన్నిహితులు నిందితులుగా ఉన్నారని ఎమ్మెల్యే పేరు రాకుండా ఉండేందుకే అధికార పార్టీలో చేరాడన్నారు. 

శాసనసభ ఎన్నికల్లో నా, నా కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల నమ్మకద్రోహి దగ్గర పనిచేసే కంటే, నేను మీలా కిందిస్థాయిలో పని చేశాన్నన్నారు. అందరం కలిసి జగిత్యాల అభివృద్ధి చేసుకుందామని డాక్టర్ భోగ శ్రావణి కోరారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, మండల అధ్యక్షులు నల్గొండ తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షులు దూరిశెట్టి మమత, మ్యాకల లక్ష్మి, సింగం పద్మ, పుష్ప, భాను ప్రియ, మధురిమ, కవిత, లావణ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.