న్యూఢిల్లీ, నవంబర్ 17: అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. దీనిలో భాగంగానే సుమారు 438 మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నోటీసులు అందుకున్న వారిలో 218 మంది ఇంజినీర్లు, కాగా మిగతా వారు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, విశ్లేషకులు, ఇతర సిబ్బంది. వీరిలో అర్హత కలిగిన ఉద్యోగులకు సంస్థ మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కల్పిస్తామని ప్రకటించింది.