సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): సంగారెడ్డి నియోజకవర్గంలోని ఉత్తరపల్లిలోని ఫ్లిప్కార్ట్ కంపెనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహాన్ని చూస్తుంటే ఎవరో హత్య చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పోలీసు పరిధి సంగారెడ్డి రూరల్ కిందకు వస్తుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, చుట్టు ప్రక్కల విచారించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.