calender_icon.png 16 March, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మే అర్థం చేసుకోవాలి!

16-03-2025 12:36:36 AM

బాడీ షేమింగ్.. ఈ విషయంలో ఎక్కువగా బాధితులు అమ్మాయిలే అవుతున్నారు. అమ్మాయి సన్నగా ఉంది. పొట్టిగా ఉంది. లావుగా ఉంది. నల్లగా ఉంది.. ఇలా రకరకాలు ఎదుటి వ్యక్తుల శరీరాకృతిని చూసి మాట్లాడుతుంటారు. అయితే కొందరు జన్యుపరంగా లావుగా లేదా సన్నగా ఉంటారు. జుట్టు పొడవుగా లేదనో, రంగు తక్కువ ఉన్నారనో, అందంగా లేరనో ఇలాంటివి మాత్రమే కాకుండా సరైన బట్టలు వేసుకోలేదనో, ఫ్యాషన్‌గా లేరనో, ఇతరుల్లా అలవాట్లు లేవనో.. ఇలా బోలెడు ఈ బాడీ షేమింగ్ కిందకు వస్తాయి.

అయితే చాలావరకు బాడీ షేమింగ్ ఇంటి నుంచే మొదలవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒక అమ్మాయి సన్నగా, లావుగా, నల్లగా ఉంటే ఆమె తల్లే విమర్శించడం మొదలు పెడుతుంది. ఈమెకు పెళ్లి ఎలా చెయ్యాలని చిన్నప్పటినుంచే ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా అందం, శరీరాకృతి వంటి వాటికి అధిక ప్రాధాన్యమిచ్చే తల్లిదండ్రులు, కుటుంబ వాతావరణంలో పిల్లలు పెరగడడం వల్ల కూడా వారిలో బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది క్రమంగా డిప్రెషన్‌కు దారితీసి, ఆత్మహత్యకు ప్రేరేపించే అవకాశం ఉంది. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటం, ఎవరీ శరీరాన్ని వారు ప్రేమించుకోవడం, మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి ధ్యానం చేయడం వంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.