calender_icon.png 26 February, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూట్‌కేసులో శరీర భాగాలు

25-02-2025 11:41:32 PM

హుగ్లీ నదిలో విసిరిసేందుకు యత్నిస్తూ పట్టుబడిన ఇద్దరు మహిళలు..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పోలీసులు సూట్‌కేసులో మానవ శరీర భాగాలను గుర్తించారు. ఇద్దరు మహిళలు వాటిని హుగ్లీ నదిలో విసిరేసేందుకు యత్నిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అహిరిటోలా ప్రాంతంలో మంగళవారం ఇద్దరు మహిళలు ఓ సూట్‌కేసుతో ట్యాక్సీ దిగారు. ఆ ప్రాంతంలో వారు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిని విచారించారు. మహిళలు పొంతన లేని సమాధానాలిస్తుండడంతో సూట్‌కేస్ తెరచి చూశారు. దానిలో మానవ శరీర భాగాలు ఉండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. శరీర భాగాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళలు ఎవరినైనా హత్య చేశారా? తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేశారా? అన్న కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.