calender_icon.png 7 February, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ కాలువలో మహిళా మృతదేహం లభ్యం

07-02-2025 07:41:20 PM

నడిగూడెం (విజయక్రాంతి): నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మహిళా మృతదేహం లభ్యమైనట్లు శుక్రవారం ఎస్సై జి అజయ్ కుమార్ తెలిపారు. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎలక చక్రారెడ్డి భార్య నారాయణమ్మగా స్థానికులు గుర్తించారు. ప్రస్తుతం సూర్యాపేటలో నివాసం ఉంటున్నా ఆమె గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు పాపిరెడ్డి పిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. లభ్యమైన మృతదేహాన్ని  కుమారుడు పాపిరెడ్డి స్వాధీనపరచి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.