26-04-2025 09:08:08 AM
మహిళ వివరాలు తెలిసిన వాళ్ళు పోలీసులు కు సమాచారం ఇవ్వాలి
మంథని ఎస్ఐ డేగ రమేష్
మంథని, (విజయక్రాంతి): మండలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయిందని ఎస్ఐ రమేష్(SI Ramesh) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గుర్తు తెలియని మహిళ మృతదేహం మంథని మండలంలోని గుమ్మనూరు పరిధిలోని మహబూబ్ పల్లి శివారులో ఉందని. ఆ మహిళ వివరాలు తెలిసిన వాళ్ళు మంథని పోలీసులకు సమాచారం ఇవ్వాలని మంథని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు. మృతి చెందిన మహిళ యాదవ కులానికి చెందిన మహిళగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు.