calender_icon.png 9 January, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ కెనాల్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం..

08-01-2025 10:47:53 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని పెద్ద పాపయ్య పల్లె కెనాల్ లో గుర్తుతెలియని మహిళా మృతదేహం కొట్టుకు వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ తిరుమల్ గౌడ్ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపారు. మహిళ మృతదేహాన్ని తాళ్లతో బయటకి తీశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కెనాల్ లో కొట్టుకొచ్చిన మహిళ ఎవరో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా మృతదేహాన్ని గుర్తుపట్టితే హుజురాబాద్ ఎస్ హెచ్ ఓ 8712 670773, ఎస్సై హుజురాబాద్ 8712574726 ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని సీఐ తిరుమల్ గౌడ్  కోరారు.