11-04-2025 03:06:11 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం(Bellampalli Mandal)లోని ఆకెనపల్లి గ్రామ శివారులో 45 సంవత్సరాల గుర్తుతెలియని మగ వ్యక్తి శవాన్ని శుక్రవారం కనుగొన్నట్లు తాళ్ల గురజాల ఎస్సై చుంచు రమేష్ తెలిపారు. గ్రామానికి చెందిన మామిడి శ్రీనివాసరెడ్డి చేనులో గల చింత చెట్టుకు రెడ్ కలర్ టవల్ తో ఉరివేసుకుని ఉన్నట్లు తెలిపారు. మృతిని శరీరంపై బ్లూ కలర్ బనియన్, బ్లూ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే 8712656561,8712656563 నెంబర్ లలో సమాచారం అందించాలని ఎస్సై రమేష్ కోరారు.