23-03-2025 12:00:00 AM
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
శేరిలింగంపల్లి,మార్చి 22(విజయక్రాంతి): హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద పసికందు మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీటిలో ఓ పసికందు మృతదేహం కొట్టుకువచ్చింది.
అటు గా వెళ్తున్న వెళుతున్న వాహనదారులు గుర్తించి మాదాపూర్ పోలీసులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకు న్న పోలీసులు ఘటన స్థలిని పరిశీలించారు. అనంతరం పసికందు మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.