calender_icon.png 23 December, 2024 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీబీనగర్ చెరువులో మృతదేహం లభ్యం

04-08-2024 12:00:00 AM

యాదాద్రి భువనగిరి, ఆగస్టు3 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్ద చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమా చారం అందుకున్న పోలీసులు చెరువులో నుంచి మృతదేహాన్ని బయట కు తీసి అతడి దుస్తుల్లో ఉన్న కార్డుల ఆధారంగా మృతుడు జామె ఉస్మానియాకు  చెందిన గుగ్గిళ్ల  సాయికుమా ర్‌గా గుర్తించారు. విషయాన్ని ఇంటిసభ్యులకు తెలపగా వారు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి సోదరి మాట్లా డుతూ..  సాయికుమార్ గురువారం బయటకు వెళ్తు న్నా అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని అన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్మ చేసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది.