సిద్దిపేట, జూలై 11(విజయక్రాంతి): సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాడీ బిల్డర్ మహ్మద్ సోహైల్ (23) మృతిచెందాడు. సిద్దిపేటలోని సాజిద్‌పురా లో నివాసం ఉండే సోహైల్, వారం రోజుల క్రితం మీర్‌దొడ్డి పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతిచెం దాడు. మిస్టర్ తెలంగాణగా గుర్తింపు పొందిన సోహైల్.. రెండు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో, ఆరు సార్లు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి గుర్తింపు పొందాడు.