ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం బోడు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పొడిసెట్టి శ్రీకాంత్ శనివారం రాష్ట్ర డిజిపి జితేందర్ చేతుల మీదుగా రివార్డు తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను 2023లో భద్రాచలం పీఎస్ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో 484 కేజీలు, 480 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు ముద్దాయిలను పట్టుకొని వారికి 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడేవిధంగా కోర్టుకు ఆధారాలు సమర్పించినందుకు గాను ఎస్ఐ ఈ రివార్డును అనుకున్నారు. రివార్డ్ అందుకున్న ఎస్ఐని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్ అభినందించారు.