17-03-2025 04:03:52 PM
కోదాడ,(విజయక్రాంతి): మండల పరిధి లోని పాత గుడిబండ గ్రామంలో 25వ బొడ్రాయి స్థాపిత వార్షికోత్సవ సందర్భంగా సోమవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన జలాభిషేకం కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దకాపు ఎలమర్తి జానకిరామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, తుమాటి నాగిరెడ్డి, నవరొత్తంరెడ్డి, ఇర్ల వెంకట్రాంరెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి, చింత సత్యనారాయణ రెడ్డి, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, ఇర్ల వెంకట నర్సిరెడ్డి, వంక వెంకట్ రెడ్డి, మట్ట కృష్ణారెడ్డి, గాయం వీరారెడ్డి,తూమాటి రాఘవరెడ్డి, ఇర్ల నారపురెడ్డి, శివాచారి తదితరులు పాల్గొన్నారు.