calender_icon.png 28 December, 2024 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

28-10-2024 01:29:22 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్27 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం సోమినిలో శనివారం ప్రాణహితనదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఆదివారం ఇద్దరి మృతదేహాలు లభించాయి. వీరిలో జహీర్ హుస్సేన్ (24), ఇర్షాద్ (20) ఉన్నారు. మొహిసీద్ (22) ఆచూకీ కోసం జాలర్లు గాలిస్తున్నారు. గాలింపు చర్యల్లో ఎస్సై విక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రాణహిత నదిలో గల్లంతైన మృతుల కుటుంబాలను ఎమ్మెల్సీ దండె విఠల్ పరామర్శించారు.