calender_icon.png 15 November, 2024 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపూజీ వచనాలయ నిర్మాణ పనులు పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే

15-11-2024 03:12:25 PM

భవన నిర్మాణానికి 10 లక్షలు మంజూరు

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సన్మానించిన ప్రతినిధులు

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రజలకు గత ఏడు దశాబ్దాలుగా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు యువతి యువకులకు బాపూజీ వచనాలయం సేవలందించిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాపూజీ వచనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంతోమంది బాపూజీ వచనాలయంలో చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నారు. యువతి యువకుల కోసం శిథిలావస్థలో ఉన్న బాపూజీ వచనాలయ భవనాన్ని నూతనంగా నిర్మించేందుకు బాపూజీ వచనాలయ కమిటీ ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. తన వంతుగా 10 లక్షలు బాపూజీ భవన వచనాలయ నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ఎంతోమంది నిరుద్యోగులకు విద్యార్థినీ విద్యార్థులకు యువతి యువకులకు బాపూజీ వచనాలయం పోటీ పరీక్షలకు చదువుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బాపూజీ వచనాల కమిటీ ప్రతినిధులు ఢిల్లీ భక్తవత్సలం, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కోశాధికారి గంగాధర్ రావు కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, మీసాల సుధాకర్ రావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ ఉందన్, గడుగు గంగాధర్, రత్నాకర్, నుడా చైర్మన్ కేశ వేణు, భోగ అశోక్, మైపాల్ రెడ్డి, దిలీప్ పవర్ లక్కంరెడ్డి ప్రతాప్ రుద్ర తదితరులు పాల్గొన్నారు.