calender_icon.png 16 April, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీవోబీ బంపర్ ఆఫర్

08-04-2025 12:18:47 AM

అత్యధిక వడ్డీరేట్లతో కొత్త డిపాజిట్ స్కీమ్

ముంబై, ఏప్రిల్ 7: ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కొత్తగా టర్మ్ డిపాజిట్ పథకాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ‘బాబ్ స్కేర్ డ్రైవ్ డిపాజిట్ స్కీమ్’ పేరుతో 444 రోజుల కాలపరమితితో తెచ్చిన ఈ పథకంలో ఆకర్షణీయ వడ్డీరేట్లను ప్రకటించింది. ఈ టర్మ్ డిపాజిట్ పథకం ద్వారా బీవోబీ సాధారణ ప్రజలకు ఏడాదికి 7.15% వడ్డీరేట్లను ఆఫర్ చేస్తుంది.

అలాగే సీనియర్ సిటిజన్లకు 7.75% శాతం వడ్డీరేట్లను అందిస్తుంది.  80ఏళ్లు, ఆపైన వయసు గల సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో డబ్బులను డిపాజిట్ చేస్తే అత్యధికంగా 7.80% వడ్డీరేటును బీవోబీ ఆఫర్ చేస్తుంది. సీనియర్ సిటిజన్లను రెసిడెంట్ సీటిజన్లు, రెసిడెంట్ సూపర్ సీనియర్ సిటిజన్లుగా వర్గీకరించి వారి డిపాజిట్లపై వరుసగా 7.65%, 7.75% వడ్డీరేట్లను అందిస్తుంది.

ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ డిపాజిట్లపై 7.20% వడ్డీరేటు అందిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే రూ.3కోట్ల కంటే తక్కువ విలువైన నాన్ కాలబుల్ రిటైల్ టర్మ్ డిపాజిట్లకే ఈ పథకం వర్తిస్తుందని బీవోబీ స్పష్టం చేసింది. కస్టమర్లు సమీప బీవోబీ శాఖను సందర్శించి లేదా బీవోబీ వరల్డ్ యాప్ ద్వారా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను తెరవొచ్చని వెల్లడించింది.