calender_icon.png 11 January, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యంతోనే బోటు ప్రమాదం

20-12-2024 02:03:25 AM

  1. ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు లేవు
  2. నేవీ బోటు స్టంట్‌లు చేసిందన్న ప్రత్యక్ష సాక్షులు

ముంబై, డిసెంబర్ 19: ముంబై బోటు ప్రమాదంపై కీలక విషయా లు బయటకొచ్చాయి. ఫెర్రీ బోటు నిర్వాహకులు తమకు లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సుమారు 20 25 నిమిషాల తర్వాత నేవీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభిం చారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ప్ర యాణికుడు వెల్లడించారు.

మరోవైపు ఫెర్రీ బోటును ఢీకొట్టిన నేవీ బోటు సముద్రంలో స్టంట్‌లు చేసిందని రాజస్థాన్‌కు చెందిన శ్రవణ్ కు మార్ తెలిపారు. నేవీ బోటు స్టంట్‌లను తన కెమెరాలో రికార్డు చేసిన ట్టు వెల్లడించారు. నేవీ బోటు స్టంట్ లు చేస్తుండగా నియంత్రణ కోల్పోయి ఫెర్రీ బోటును ఢీ కొట్టిందని ఆ యన వివరించారు. అయితే నేవీ అధికారులు మాత్రం బోటు ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నా రు.

పోలీసులు నేవీ స్పీడ్ బోటును డ్రైవ్ చేసిన అధికారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కా గా, ఎలిఫెంటా దీవి నుంచి ఇండి యా గేటు వైపు వస్తున్న ఫెర్రీ బోటు ను నేవీ బోటు బుధవారం ఢీ కొట్టడంతో ఓ నేవీ అధికారి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా 115 మందిని రక్షించిన విషయం తెలిసిం దే.

ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబా లకు పరిహారం ప్రకటించాయి.