21-03-2025 01:15:34 AM
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, మార్చి 20 (విజయ క్రాంతి): కరీంనగర్ పోలీసు కమీషనరేట్ పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సెక్షన్ 163 బిఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ -2023 అమలులో వుంటుందని కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా వుండరాదని పేర్కొన్నారు.
ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, మూసివేయాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.