03-04-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్2 (విజయ క్రాంతి): గత నెల 2వ తేదీన ప్రమాదానికి గురైన చట్ల సమ్మయ్య కు డాక్టర్ బి.ఎన్ రావు స్పందించి 20వేల ఆర్థిక సాయం అందించారు. మార్చ్ 2 తేదీన ప్రమాదానికి గురైన చట్ల సమ్మయ్య నెల రోజులుగా కోమాలో ఉన్నాడు, హైదరాబాదులో తలకి ఆపరేషన్ చేయించుకుని రెండు వారాల తర్వాత కరీంనగర్ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం అక్కడ ఒక వారం రోజులు ఉన్న తర్వాత రోగి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో నగరంలోని ఒక రిహాబి డేషన్ సెంటర్లో వైద్యం పొందుతున్నాడు, నెల రోజులుగా వైద్య ఖర్చులు సుమారు పది లక్షల వరకు ఖర్చ ఖర్చు అయినాయి.
కడు నిరుపేద కుటుంబమైన సమ్మయ్య కుటుంబానికి డాక్టర్ బి.ఎన్ రావు తమ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేలు ఆర్థిక సాయం చేసి వారి కుటుంబానికి అండగా నిలబ డ్డారు, అంతేకాకుండా ఆస్పత్రి యాజమా న్యంతో మాట్లాడి పేషెంట్ కి తగిన వైద్యం అందించాలని కోరారు.