calender_icon.png 4 December, 2024 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లూస్మార్ట్ క్యాబ్ డ్రైవర్ దోపిడీ

04-12-2024 12:13:29 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: యూపీకి చెందిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గత నెల 29న   గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళ స్థానిక మాల్ నుంచి సెక్టార్ 86లోని గ్రీన్‌బర్గ్ మైక్రోటెక్‌కు వెళ్లేందుకు  బ్లూ స్మార్ట్‌లో క్యాబ్ బుక్ చేసుకుంది. మార్గ మధ్యలో క్యాబ్ డ్రైవర్ ఆమె ను గన్‌తో బెదిరించి రూ.55వేలను తన అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న వస్తువులను తీసుకుని పారిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అధి కారులు డిసెంబర్ 1న క్యాబ్ డ్రైవర్‌ను ఆరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. నిందితుడిని కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఘటనపై బ్లూస్టార్ సంస్థ స్పందించింది. బాధితురాలికి క్షమాపణ తెలుపుతూ ప్రయాణికుల క్షేమం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.