calender_icon.png 2 November, 2024 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ‘మెట్రో’పై నీలినీడలు

13-05-2024 02:25:23 AM

2026 నాటికి అమ్మేస్తారని కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు

వదంతులపై మౌనం వహిస్తున్న ఎల్‌అండ్‌టీ 

హెచ్‌ఎంఆర్ ఫేజ్‌ే విస్తరణపై అనుమానాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపై నీలినీడలు అలుముకున్నాయి.  తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కారణంగా మెట్రోలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో, 2026 నాటికి మెట్రోను అమ్మేస్తున్నట్లు ఓ బిజినెస్ ఛానల్‌లో ఎల్‌అండ్‌టీ అధ్యక్షుడు, శాశ్వత డైరెక్టర్ శంకర్ రామన్ పేరుతో వచ్చిన కథనాలు  వైరల్‌గా మారాయి.

తెలుగు మీడియాలోనూ దీనిపై వరుస కథనాలు వస్తున్నాయి. కానీ ఈ వదంతులపై ప్రభుత్వం గాని, ఎల్‌అండ్‌టీ గాని ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో వదంతులకు మరింత బలం చేకూరినట్లు అవుతుంది. మెట్రోలో ఇప్పటి వరకు సుమారు 54 కోట్ల మంది ప్రయాణం చేశారని ఎల్‌అండ్‌టీ ఇటీవల  వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ అంతలోనే మెట్రోను అమ్మేస్తున్నట్లుగా కథనాలు రావడంతో మెట్రో పరుగులు ఇతరుల చేతిలోకి వెళ్తాయా అనే చర్చ మొదలైంది.

మహాలక్ష్మి పథకం అమలుతో...

తెలంగాణలో కాంగ్రెస్ మహిళలకు ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో  మెట్రోపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు 2017 నవంబర్ 18 నుంచి నగర వాసులకు అందుబాటులోకి వచ్చాయి. అనతి కాలంలోనే ఏకంగా 54 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించి దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా అవతరించింది. 

పీపీపీ పద్ధతిలో మెట్రో నిర్వహణ..

హైదరాబాద్ మెట్రో రైల్‌ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో నిర్మించారు. ఎల్‌అండ్‌టీ వాటా 90 శాతం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం ఉంది. దాదాపు 70 కిలోమీటర్లు మెట్రో లైన్ ఉంది.  నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ సంస్థ పర్యవేక్షిస్తోంది. ప్రతిరోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. తాజాగా మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి 2026 నాటికి ఎల్‌అండ్‌టీ వైదొలుగుతుందనే వదంతులు వస్తుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

ఫేజ్‌d విస్తరణపై అనుమానాలు..

మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఫేజ్ అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. ఓల్డ్‌సిటీ మీదుగా శంషాబాద్ వరకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే సుమారు రూ.20 వేల కోట్లతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశామని ఎల్‌అండ్‌టీ, మెట్రో, ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఫేజ్  పనులు ప్రారంభం అవుతాయని నగర వాసులు భావించారు. ఇటీవల మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి నూతన అలైన్‌మెంట్ పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కానీ వదంతులతో ఫేజ్  2 విస్తరణపై సందేహం వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం గాని, మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులు గాని స్పష్టత ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.