calender_icon.png 20 November, 2024 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో బ్లూ ఎకానమీ పాలసీ

29-06-2024 01:16:08 AM

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం త్వరలో బ్లూ ఎకానమీ పాలసీని ప్రకటిస్తుందని మారిటైమ్ రీసెర్చ్ సెంటర్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రఫుల్ తలేరా పేర్కొన్నారు. శుక్రవారం యంగ్ ఫిక్కి మహిళా సంస్థ (వైఎఫ్‌ఎల్‌ఓ) ఆధ్వర్యంలో బ్లూ ఎకానమీలో అంతులేని అవకాశాలపై ప్రత్యేక సెషన్ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బ్లూ ఎకానమీ నిపుణులు ప్రఫుల్ తలేరా హాజరై మాట్లాడారు. బ్లూ ఎకానమీ గురించి అవకాగాన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా భారత భూ భాగంలోని జలాలను అర్థం చేసుకోవాలన్నారు. సముద్ర జీవవైవిధ్యాన్ని పరిరక్షిం చడమే లక్ష్యంగా భారత్‌కు బ్లూ ఎకానమీ పాలసీ అవసరమని గుర్తించిన కేంద్రం.. త్వరలో ప్రకటించనుందని చెప్పారు. సముద్రరంగంలో ఆవిష్కరణలు రాబోయే తరా లకు స్థిరమైన పురగోతికి ఉపయోగపడుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎఫ్ ఎల్‌ఓ చైర్‌పర్సన్ రిధీ జైన్, కెప్టెన్ దిలీప్ దొండే, ఐశ్యర్య బొడ్డపాటి పాల్గొన్నారు.