22-03-2025 10:59:00 PM
ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): బ్లూ కోల్డ్స్, పెట్రోలింగ్ సిబ్బంది అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పి రోహిత్ రాజ్ ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందితో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి ప్రాంతంలో రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు.డయల్ 100 ఫోన్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ తమ విధులను క్రమశిక్షణతో నిర్వర్తించాలని తెలిపారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి సిఐ శ్రీనివాస్ మరియు ఐటీ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ నాగరాజురెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.